ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుండి 107వ స్థానానికి పడిపోవడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో డబుల్ ఇంజన్ డిజాస్టర్ అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ… దేశంలో అచ్చేదిన్ కొంతమందికి మాత్రమేనని, మిగిలినవారికి డిజాస్టర్ అంటూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో పోయిన ఏడాది కంటే మరింత కిందికి పడిపోవడం మోదీ సాధించిన గొప్ప విజయమని, దేశాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు.