mt_logo

ఇబ్బంది ఉన్నవాళ్లు అన్ ఫాలో అవండి : మంత్రి కేటీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీని విమ‌ర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్ర‌తీసారి ఇబ్బంది ప‌డే వారు ట్విట్ట‌ర్‌లో త‌న‌ను అనుస‌రించొద్ద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ సూచించారు. కేంద్రం, బీజేపీ వైఖ‌రిని, దుష్ప్రచారాన్ని తాను ఎండ‌గ‌డుతూనే ఉంటాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక అచ్చేదిన్ దివాస్‌ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోల్చుతూ కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్రం నుంచి స‌రైన స‌హ‌కారం లేక‌పోవ‌డంతో.. తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని సంద‌ర్భానుసారంగా కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించాల్సిన కేటాయింపుల‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై కేంద్రాన్ని కేటీఆర్ నిల‌దీస్తున్న విష‌యం విదిత‌మే. కేంద్రం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై కేటీఆర్ ఫైర్ అవుతూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *