mt_logo

రాష్ట్రంలో కొలువుల కుంభమేళా : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో నెలకొన్నది కొలువుల జాతర కాదని, కొలువుల కుంభమేళా అని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్. ఒకేసారి 80,039 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న చేసిన సంద‌ర్భంగా యావ‌త్ తెలంగాణ యువ‌త త‌ర‌పున సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ప్ర‌సంగిస్తూ… ఇది కొలువుల జాత‌ర కాదు.. కొలువుల కుంభ‌మేళా అని పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో స‌భా నాయ‌కుడిగా సీఎం అధికారికంగా ప్ర‌క‌టించారు. ఉత్కంఠ‌తో చూసిన ఉద్యోగ అభ్య‌ర్థులు సంబురాలు చేసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగ అభ్య‌ర్థులు చ‌దువులో మునిగిపోయారు. ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన ఓ ఇద్ద‌రు నాయ‌కులు సీఎం ప్ర‌క‌ట‌న న‌మ్మం అని స్టేట్‌మెంట్ చేశారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న న‌మ్ముతాం అనే వారు చ‌దువుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. న‌మ్మం అనే వారు మోదీ ఇస్తామ‌న్న 2 కోట్ల ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. మాది మాట‌ల ప్ర‌భుత్వం కాదు.. చేత‌ల ప్ర‌భుత్వం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బీజేపీ నేత‌ల మాట‌లు కోట్ల‌లో ఉంటాయి.. ప‌నులేమో ప‌కోడిలా ఉంటాయి’ అన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కోచింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేసి, పిల్ల‌ల‌కు భోజ‌న స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స‌భ వేదికగా ముందుకు రాగా… మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దీనికి కావాల్సిన మౌలిక స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తుంద‌న్నారు. భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధ‌ర్ బాబు కూడా ఈ విష‌యంలో చొర‌వ చూపాలని సూచించారు. టీ శాట్ ద్వారా పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్ ఇస్తున్నామని తెలియజేశారు. ప్ర‌భుత్వ రంగంలో ల‌క్ష ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చెప్పామని, గ‌త ట‌ర్మ్‌లో ల‌క్షా 32 వేల పైచిలుకు ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం. నిన్న‌టి ప్ర‌క‌ట‌న‌తో ఆ సంఖ్య 2 ల‌క్ష‌ల 47 వేల‌కు చేరువైంది. నినాదాలు ఇవ్వ‌కుండా.. అభివృద్ధి, సంక్షేమ‌మే ఎజెండాగా ముందుకు వెళ్తున్నామ‌ని కేటీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *