నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థినుల ఆందోళనపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరం లేదని, ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని సత్వరమే చర్యలు చేపట్టాలని మరోవైపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు.
కాగా నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యూయేషన్ డేకు హాజరైన కళాశాల పూర్వ విద్యార్థి, మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్ కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూ వీసీ మరో కోటి రూపాయిల ఫండ్ కాలేజీకి అలాట్ చేశారు. ఈ నిధులతో అధికారులు కాలేజీ హాస్టల్ భవనం నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో స్పందించిన ఆయన.. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.