గొప్ప సంఘ సంస్కర్త, ఆలోచనాపరుడు మహాత్మా జ్యోతిబా ఫూలేకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. మహిళా విద్యకు మార్గదర్శకుడు జ్యోతిబా ఫూలే అని కేటీఆర్ కొనియాడారు. మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు రవీంద్ర భారతిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని ధారపోసిన జ్యోతిబాఫూలే 196 జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.

