ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, శుక్రవారం ప్యారిస్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ ‘స్టేషన్ ఎఫ్’లో పర్యటించి స్టేషన్ ఎఫ్ బృందంతో భేటీ అయ్యారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ వంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సంస్థల గురించి వివరించారు. స్టేషన్ ఎఫ్‌లో వెయ్యి స్టార్టప్‌లు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టిన ఏడీపీ చైర్మన్, సీఈవో అగస్టిన్ డి రోమనెట్‌తో కూడా కేటీఆర్ బృందం సమావేశమైంది. భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కరోనా ఆంక్షలు సడలించడంతో వైమానిక పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించే అవకాశాలున్నాయని, అనేక ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని కేటీఆర్ వివరించారు. అనంతరం సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్ను కేటీఆర్ కలిశారు. సనోఫీ త్వరలో తన హైదరాబాద్ ఫెసిలిటీ నుండి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుండగా.. ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం పారిస్‌లోని మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఈడీఈడీ) డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో చర్చలు జరిపింది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ సాధించిన విజయాలను కేటీఆర్ వివరించారు. మంత్రి వెంట పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు.
- Telangana Digital Media Wing Director Dileep Konatham bags ‘Social Media Person of the Year’ award
- Tamil Nadu requests 7 lakh tonnes boiled rice from Telangana
- KTR’s effort pays off; Telangana man languishing in Dubai jail to be freed
- Distribution of double bedroom houses is done in a very transparent manner: KTR
- Genome Valley to be expanded in another 250 acres: KTR
- సీఎం కేసీఆర్ సంకల్పం.. దేశానికే బువ్వగిన్నెలా రాష్ట్రం.. తెలంగాణ బియ్యం కోసం పక్క రాష్ట్రాల క్యూ!
- ధనవంతుల ఇండ్ల తరహాలో జీహెచ్ఎంసీలో రూ. 10 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మంత్రి మహేందర్ రెడ్డి
- కేసీఆర్ జనాలకు కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నాయి: మంత్రి హరీష్ రావు
- హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 50 వేల నుండి 60 వేల కోట్లు: మంత్రి కేటీఆర్
- Minister KTR inaugurates Eurofins BioPharma Services Campus in Hyderabad
- బీజేపీ చిల్లర రాజకీయం.. మొన్న కశ్మీర్ ఫైల్స్.. నేడు రజాకార్.. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే కుట్ర!
- తెలంగాణ ప్రభుత్వ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలా? అయితే ఈ వాట్సాప్ చానల్ ఫాలో అవ్వండి
- 33% మహిళా కోటలో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత
- సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలి: సీఎస్ శాంతి కుమారి
- రైతు సంక్షేమంపై తగ్గేదే లే.. రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కారు