ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులకు, నాచారంలో ఎస్టీపీ పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే ఉప్పల్ రింగ్ రోడ్డులోని థీమ్ పార్కును ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… రూ.3866 కోట్లతో ఎస్ టిపిలు నిర్మిస్తున్నామని, 900 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏడాదిన్నరలోపు ఉప్పల్ తో మరి కొన్ని ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తామని, రూ.35 కోట్లతో నిర్మించిన స్కైవాక్ ను వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. వచ్చే నెల నుంచి కొత్త ఫెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. రూ.7300 కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపడుతామని, వచ్చే జూన్ నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఉంటాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తొలగిస్తామని, ఎల్ బినగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తైందని, అసెంబ్లీ సమావేశాల తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగిస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని, వచ్చే నెలలో చర్లపల్లిలో ఆర్ యుబి ప్రారంభిస్తామని, హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, స్థానికులకు ఇక్కడ నుంచే ఉద్యోగాలు వస్తాయని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన ఉందని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ ప్రకటనను నమ్మిన వాళ్లు ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, నమ్మనివాళ్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తానన్న రెండు కోట్ల పకోడీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని చురకలంటించారు.
- Hyderabad’s real estate sector faces a crisis under Congress rule
- Congress government mulling over cutting down Rythu Bharosa beneficiaries
- Anganwadis suffering due to Congress government’s gross negligence
- Corruption became rampant in Telangana under Congress rule: Survey
- 1 cr acres of agricultural land at risk of losing Rythu Bharosa?
- బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి: కవిత
- ఆరు గ్యారెంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు: కేటీఆర్
- తెలంగాణలో నడుస్తున్నది ఇందిరమ్మ రాజ్యమా లేక పోలీస్ రాజ్యమా?: హరీష్ రావు
- బీసీలకు 42% రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము: కవిత
- భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్ బెనెగల్ తెలంగాణకు గర్వకారణం: కేసీఆర్
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్