mt_logo

నైపుణ్యం ఉంటే.. ఉద్యోగాలు మీవే : మంత్రి కేటీఆర్

యువతకు సరైన నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కోటెలిజంట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. శుక్రవారం హైదరాబాద్ లోని రాయదుర్గంలో కోటెలిజెంట్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయని, స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలియజేశారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని, దేశంలో వందకోట్లకుపైగా జనాభా ఉందని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండదని, కానీ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ స్థానికులకు, యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద మొత్తంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *