రేపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని ఫతుల్లాగూడలో ముక్తి ఘాట్, లింక్ రోడ్, పెంపుడు జంతువుల స్మశానవాటికతో పాటు, వనస్థలీపురంలో స్విమ్మింగ్ పూల్ ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
