ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా కార్యకర్త కుమార్తె వివాహానికి 3లక్షల ఆర్థికం సహాయం చేసి, వారి కుటుంబానికి అండగా నిలిచారు. పెద్దమనసు చాటుకున్నారు మంత్రి కేటీఆర్. మూడేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త మందాటి కొమురయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుకు ఎదుర్కొంటోంది. ఇటీవల కొమురయ్య కుమార్తె అంజలి వివాహం కూడా నిశ్చయం కావడంతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ కొమురయ్య కుటుంబానికి 3 లక్షల ఆర్థికసాయం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి తోట ఆగయ్య, మంత్రి పీఏ కుంబాల మహేందర్‌రెడ్డితో కలిసి అంజలికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. మంత్రి కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి నవ వధువుకు పుస్తెమట్టెలను వితరణ చేశారు. ఈ సందర్భంగా కొమురయ్య కుటుంబీకులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!