దేశభక్తిపై సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు ? : బీజేపీ నాయకులపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్

  • November 22, 2021 3:22 pm

సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్. రైతులకు సహాయం చేస్తే దేశద్రోహులు ఎలా అవుతారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ చనిపోయిన 750 రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం ప్రకటించారు. అయితె కేసీఆర్ ఖలిస్థాన్ లకు సహాయం అందించే దేశద్రోహి అంటూ బీజేపీ నాయకుడు చంద్రశేఖర్ వ్యాఖ్యానించగా.. మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండి పడ్డారు. “రైతులకు సహాయం చేస్తే దేశద్రోహం ఎలా అవుతుంది ? అంటే ఏడాదిగా పోరాడుతున్న రైతులను పట్టించుకోని వారు దేశభక్తులా ? మృతి చెందిన రైతు కుటుంబాలను ఆదుకోని వారు దేశభక్తులు అవుతారా ? అసలు దేశభక్తిపై సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ మూర్ఖులెవరు ?’ అంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.


Connect with us

Videos

MORE