mt_logo

పల్లెప్రగతి రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపింది : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి గ్రామంలో అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం వలన గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని దాదాపు అన్ని గ్రామాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ విభాగంలో చేర‌డంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో బహిర్భూమి రహిత గ్రామాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది..? అంటూ ట్విటర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. 96.74 శాతం ఓడీఎఫ్ గ్రామాలతో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు అందనంత దూరంలో నిలిచిందన్నారు. తెలంగాణ తర్వాత 35.59శాతంతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచిందన్న కేటీఆర్.. పల్లెల అభివృద్ధికి పాటుపడుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *