నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ రావు చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయినను పోయి రావలె హస్తినకు అనేది పాత సామెత అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే ఉందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
‘మహాభారతంలో సంధి కుదరదని తెలిసి కూడా శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన ఘటన నుంచి కేసీఆర్ జ్ఞానం పొంది ఉండాలి. ప్రధాని, ముఖ్యమంత్రులు హాజరయ్యే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం హాజరై ప్రశ్నించి ఉండాల్సిందది’ అని నాగేశ్వర్ రావు పేర్కొనగా…నీతి ఆయోగ్ లో నీతి లేదని, అందుకే సీఎం కేసీఆర్ ఆ సమావేశానికి హాజరు కాలేదని కేటీఆర్ వెల్లడించారు.