చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఆత్మనిర్భరత్‌కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించారు. ప్రధాని మోదీనేమో.. భారత్‌కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారు. చేనేత పరిశ్రమ కుంటు పడేలా చేస్తూ… చేనేత కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్న మొదటి ప్రధానిగా మోడీ చరిత్ర గుర్తింపు పొందారని ఎద్దేవా చేశారు. ఇదేనా మీఋ చెప్పిన ఆత్మనిర్భర్ భారత్..? ఇదేనా మీరు చెప్పిన చెప్పే వోకల్ 4 లోకల్..? అని కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా ప్రశ్నించారు.