రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు అవార్డులే నిదర్శనం : మంత్రి కేటీఆర్

  • November 22, 2021 12:56 pm

పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ఏడాది వివిధ పురపాలక సంఘాలు సాధించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులే నిదర్శనమని పేర్కొన్న కేటీఆర్…స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021 అవార్డులు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఉన్నతాధికారులకు అభినందనలు తెలిపారు.

దేశంలో 2వ స్థానం :

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు, పథకాలతో పట్టణాల్లో అనేక మార్పులు వచ్చాయని, పట్టణ పాలన విషయంలో పీఎం స్వనిధి వంటి కార్యక్రమాల్లోనూ జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తున్నామని గుర్తుచేశారు. సఫాయి మిత్ర పథకంలో దేశంలో రెండోస్థానంతోపాటు, 11 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రావటం తెలంగాణకు గర్వకారణమన్నారు. పురపాలకశాఖ సిబ్బంది, పురపాలికల ప్రజాప్రతినిధుల నిబద్ధత, కృషితోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. అవార్డులు సాధించిన పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని ఇతర పట్టణాలు చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌ స్వయంగా కలిసి అభినందించడం పట్ల పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. కేటీఆర్‌ నాయకత్వంలో పట్టణాలను మరింతవేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.


Connect with us

Videos

MORE