mt_logo

కరోనా పాజిటివ్ గర్భిణీకి డెలివరీ చేసిన పీహెచ్సీ సిబ్బంది… అభినందించిన మంత్రి కేటీఆర్

కరోనా పాజిటివ్ గర్భిణీకి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సాధారణ డెలివరీ చేయడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి వైద్య సిబ్బందిని అభినందించారు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన లకావత్ రజిత అనే గర్భిణీకి రెండు రోజుల కింద కరోనా పాజిటివ్ రాగా, బుధవారం పురిటి నొప్పులు రాగా… జిల్లా కేంద్రానికి తరలించే సమయం లేకపోవడంతో ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందే నార్మల్ డెలివరీ చేశారు. పేషంట్ ను జిల్లా కేంద్రానికి తరలించే సమయం లేక, తల్లీబిడ్డా ఇద్దరినీ కాపాడేందుకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, MCH పోగ్రాం అధికారి కపిల్ సాయి మార్గనిర్దేశాలతో ధైర్యంతో పురుడు పోసినట్టు ఎల్లారెడ్డిపేట వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పుష్పలత, సుజాత, కీర్తి, సహకారం అందించిన ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *