mt_logo

జర్మనీ పరిశ్రమలకు ఆహ్వానం : మంత్రి కేటీఆర్

జర్మనీ ప్రభుత్వంతో, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమ్మతంగా ఉందని పేర్కొన్నారు. సోమవారం హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జ‌ర్మ‌నీ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ జ‌రిగింది. ఈ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి జర్మనీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయని, జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, రెండు వేల ఎకరాల్లో స్థలం కూడా అందుబాటులో ఉంచామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. తొలి ప్రాధాన్య‌త‌గా విద్యుత్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, అన్ని రంగాల‌కు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా అందుబాటులోకి తెచ్చామని స్ప‌ష్టం చేశారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు సింగిల్ విండో విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమ‌తులు ఇస్తున్నామ‌ని తెలిపారు. అమెరికాలో కూడా టీఎస్ ఐపాస్ లాంటి చ‌ట్టం లేద‌ని, టీఎస్ ఐపాస్ ద్వారా 17,500 కంపెనీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క్లియ‌రెన్స్ ఇచ్చామ‌ని మంత్రి కేటీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *