mt_logo

కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది : మంత్రి కేటీఆర్ 

మాదాపూర్‌ ఐటీసీ కోహెనూర్‌లో ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘వెజ్ ఆయిల్, ఆయిల్‌ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్‌ టేబుల్ – 2022’’ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని, ఎనిమిదేళ్లలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని, ఇక్కడ నుండే 9 బిలియన్ డోసుల వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి అందించామన్నారు. వ్యాక్సిన్ సిటీ హబ్ గా హైదరాబాద్ అవతరించిందన్నారు. సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ గా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ ని ఎంచుకున్నాయన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సులభమైన పద్ధతులు అవలంబిస్తున్నామని, టీఎస్ ఐ-పాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయిల్ ఉత్పత్తిలో మలేషియా, థాయిలాండ్ నుండి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఎనిమిదేళ్ళలో గ్రీన్ కవర్ 24 శాతం పెరిగిందన్నారు. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కేవలం నాలుగేళ్లలో పూర్తిచేసామన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్ ప్రాంతాలు పామాయిల్, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటల పరిశ్రమలకు అనుకూలమని… వనపర్తి, గద్వాల్ ,నాగర్ కర్నూల్, నారాయణ్ పెట్ మహబూబ్ నగర్ గ్రౌండ్ నట్ కి అనుకూలమన్నారు. ఆయా ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీపీఏ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *