mt_logo

కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో మంత్రి కేటీఆర్ శనివారం పర్యటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్‌ భగీరథ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. గణేష్ ఎకో పెట్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… విమర్శలు చేయడమే కాంగ్రెస్ పనిగా పట్టుకుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చాలా మాట్లాడారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా ఉందా? అని ప్రశ్నించారు. సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1050కి పెరిగిందని కెటిఆర్ పేర్కొన్నారు. సిలిండర్ ధరపై మాత్రం బిజెపి నేతలు మాట్లాడరని ఎద్దేవా చేశారు. అందరిలా కాదు… మేము చేసిన పని మాత్రమే చెబుతామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *