మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమశాఖ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తనకు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తనకు ఇష్టమైన శాఖ సంక్షేమ శాఖ అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తానని, నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక ప్రణాళికలు రూపొందించారని, సీఎం సహకారంతో మరింత లోతైన అధ్యయనం చేసి ముందుకు వెళ్తానన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.