రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వికలాంగులకు 70 లక్షల విలువైన ట్రై సైకిల్, ల్యాప్ టాప్ లు, స్కూటీలను, సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా, కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ప్రజలెవ్వరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ కొట్టుమిట్టాడుతున్నదని, కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ, పబ్బం గడుపుతున్న బీజేపీని ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా పగటి కలలు కంటున్నారని, సమైక్య పాలనలో నల్గొండ జిల్లాను ఎడారిగా మార్చి, ఇపుడు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలవద్దకు వస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ఎత్తులు వేసిన యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- Congress targets KTR with baseless slander and orchestrated misinformation campaigns
- KTR slams Rahul Gandhi for double standards on Adani issue
- Demolitions, DPR discrepancies, varying costs: Musi beautification project mired in controversy
- Kavitha exposes Congress party’s deceit on Musi beautification project
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
- అక్రమ కేసులకు, అణిచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం: కేటీఆర్
- ఫార్ములా-ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము రేవంత్‌కు లేదు: కేటీఆర్
- భూభారతి పత్రికా ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్
- స్థానిక సంస్థల బిల్లులో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం
- ఆదానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడు: హరీష్ రావు