mt_logo

కేసీఆర్ అడుగు పెడితే సస్యశ్యామలమే : మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే నిలిచిపోయే పథకం అన్నారు. ఒకప్పుడు తాగడానికే గుక్కెడు నీళ్లు దొరకని సంగారెడ్డి జిల్లాకు నేడు గోదావరి నది నీళ్లు వెనుకకు నడిచి వచ్చి నీళ్లిచ్చే లాగ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అడుగు పెట్టిన నెల సస్యశ్యామలం అవుతుందని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో మన జిల్లాకోసం ఏ నేత కూడా ఆలోచించించలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు, 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. రోడ్లు బాగు చేసుకున్నాం. ఇక మిగిలింది ఒక్కటే సాగు నీరు ఒకటే. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, కానీ మనం నోరు తెరిచి అడగక ముందే సీఎం గారే స్వయంగా మన కోసం ఈ ప్రణాళిక ఆలోచించి సంగమేశ్వర, బసవేశ్వర పథకాన్ని నాలుగు వేల కోట్లతో శ్రీకారం చుట్టారు. ఎక్కడో 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుండి మల్లన్న సాగర్ కు, మల్లన్న సాగర్ నుండి సింగూరుకు అక్కడి నుండి జహీరాబాద్, నారాయణ ఖేడ్, జోగిపేటకు నీటిిని అందించే మహత్తర కార్యక్రమం సీఎం కేసీఆర్ తలపెట్టారు. బోరెంచకు పిల్లనివ్వవద్దు- హత్నూరకు ఎద్దునివ్వవద్దు అని ఈ ప్రాంతంలోని సామెత. నీటి కరవు వల్ల ఈ సామెత ఇక్కడ పుట్టింది. సీఎం కేసీఆర్ దయతో తాగు నీరు వచ్చింది. ఈ సంగమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్టు సాగు నీటితో ఆ పరిస్థితి మారుతోంది. సీఎం కేసీఆర్ దయతో 8 రెసెడెన్షియల్ స్కూల్, 15 సబ్ స్టేషన్లు, మార్కెట్ యార్డులు ఏర్పడ్డాయి. 54 తండాలను పంచాయతీలుగా మారాయి. నారాయణఖేడ్ దశ-దిశ మారిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *