డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

  • August 3, 2022 4:46 pm

బుధవారం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నిరుపేదలను కొత్తింట్లోకి పంపడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామ దశదిశ మారిందని, ఇప్పటికే గ్రామాభివృద్ధికై రూ.8.30 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, సాగునీటి, తాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.


Connect with us

Videos

MORE