mt_logo

మరో సమైక్య ఆగడం

సమైక్యవాదుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. రాయలసీమవాసుల దౌర్జన్యాలకు అంతులేకుండాపోతోంది. గద్వాలకు చెందిన బీటెక్ విద్యార్ధి రవీందర్ రెడ్డి వ్యక్తిగత పనిపై మహబూబ్ నగర్ వెళ్ళాడు. తిరిగి గద్వాలకు వచ్చేందుకు కాచీగూడ నుండి చెన్నై కు వెళ్ళే చెన్నై ఎక్స్ ప్రెస్ ఎక్కి సీటు కోసం ప్రయత్నించగా దొరకలేదు.

ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి రైల్లో వస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువ ఇంజినీర్ రమేష్ జోక్యం చేసుకుని రవీందర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. రాయలసీమ వాళ్ళను తెలంగాణ వాళ్ళు ఏమీ చేయలేరంటూ దౌర్జన్యంగా వ్యవహరించాడు. గద్వాల దగ్గరకు వస్తున్నా అతడి తీరులో మార్పు రాలేదు సరికదా… జై సమైక్యాంధ్ర…సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు చేయడం మొదలుపెట్టాడు.. కడపకు చెందిన ఒక ఫొటోగ్రాఫర్ అతడికి వంతపాడడంతో ఇంకా రెచ్చిపోయాడు. తోటి ప్రయాణికులు చెప్పినా ఆగలేదు.

అప్పటివరకు ఓపిక పట్టిన రవీందర్, ఇక లాభం లేదనుకుని గద్వాలకు చెందిన విద్యార్ధి సంఘాలకు సమాచారం చేరవేయగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గద్వాలలో రైలు ఆగగానే రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటిదాకా కల్లు తాగిన కోతిలా ప్రవర్తించిన రమేష్, ఒక్కసారిగా కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిల్లాడిపోయాడు. తప్పు చేశానని, క్షమించాలని వేడుకున్నాడు. తనపై కేసు నమోదు చేస్తే తన ఉద్యోగం పోతుందని కాళ్ళావేళ్ళా పడ్డాడు. ఓ ప్రాంతం వారి మనస్తత్వాన్ని కించపరిచేలా మాట్లాడొద్దని అతనికి స్థానిక విద్యార్ధులు హితవు పలికారు. తెలంగాణ ప్రజల్లో ఇంత కరుణ వుంటుందని ఇప్పుడే తెలిసిందని రమేష్ పశ్చాత్త్తాపం వ్యక్తం చేశాడు. కేసు పెట్టకుండా అతనిని అదే సమయంలో వచ్చే బెంగుళూర్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కించి పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *