mt_logo

జేఏసీ ఆధ్వర్యంలో మ్యానిఫెస్టో- ప్రొ. కోదండరాం

తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రజలు వెల్లడించిన డిమాండ్లను, ఆకాంక్షలను కలిపి ఒక మ్యానిఫెస్టో రూపొందిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. త్వరలో మేనిఫెస్టో విడుదల చేసి అన్ని పార్టీలకు అందిస్తామని, అందులోని అన్ని అంశాలూ అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ప్రజలంతా తెలంగాణ శక్తులను ఆదరించాలని, సమైక్య పార్టీలు మళ్ళీ ప్రజలముందుకు రావడానికి కుట్రలు చేస్తున్నాయని, పెత్తనం చేయాలని చూస్తున్నాయని, అలాంటి పార్టీల వైఖరి పట్ల తెలంగాణ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *