mt_logo

పార్టీ మారడంపై మల్లారెడ్డి క్లారిటీ

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

కేవలం వ్యాపార నిమిత్తమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశానని.. యూనివర్శిటీ కోనుగొలు విషయంలో తనని ఒక మధ్యవర్తి తీసుకెళ్ళాడు అని స్పష్టం చేశారు.

వచ్చే ఐదేళ్లు బీఆర్ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని.. తన వయస్సు 75ఏళ్లు.. వచ్చే ఎన్నికలలో పోటీ చేయను అని కూడా మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.