ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో సోమవారం సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తాం అంటున్నరు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదు. ఐదేళ్లలో ఒక్క పాఠశాల, ఒక్క కళాశాల తీసుకొచ్చాడా? ఒక్క గుడి కట్టాడా? ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా.. ఒక్క రూపాయి పని చేయని బండి సంజయ్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు. మోడీ పదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. తెలంగాణకు ఏమి చేయని బీజేపీకి, కరీంనగర్‌కు నయాపైసా పని చేయని బండి సంజయ్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలి.
రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు వలన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10న కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో ఉంటుంది. ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలి.
కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారు. కష్టకాలంలో నా వెంట నిలిచిన మీకు నేను అండగా ఉంటాను. భవిష్యత్తు లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గెలుపు కోసం కష్టపడ్తాను. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు, కాంగ్రెస్‌లో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడొద్దు అందరికి అండగా ఉంటాను.
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- Defected BRS MLAs face uncertain future following High Court ruling
- BRS submits recommendations to 16th Finance Commission, seeks greater fiscal autonomy for Telangana
- HYDRAA Fear: Revenue of stamps and registrations department falls by 31% in August
- Despite heavy rains, 35% of tanks in Telangana remain empty
- కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూటై, విధుల్లో చేరబోతున్న 547 మంది ఎస్సైలకు శుభాకాంక్షలు: హరీష్ రావు
- తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం కర్ణాటక గిరిజనుల డబ్బు?.. కొత్త స్కాం బట్టబయలు
- రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- కుక్క కాట్లకు చిన్నారులు బలవుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు: హరీష్ రావు
- జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న కేసీఆర్ కల సాకారమైంది: హరీష్ రావు
- బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ: కేటీఆర్
- అరికెపూడి గాంధీని అడ్డం పెట్టుకుని రేవంత్ శిఖండి రాజకీయం చేస్తున్నారు: వేముల ప్రశాంత్ రెడ్డి
- టీవీవీపీ ఆసుపత్రుల్లో 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషం: హరీష్ రావు
- పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం!
- తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీక: కేసీఆర్