రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తన తోటి ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రులందరూ పని చేస్తారని విశ్వసిస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

