mt_logo

టీ-హబ్ భవనాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్..

గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన టీ-హబ్ భవనాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ సెంటర్ గా టీ-హబ్ పేరు పొందగా ఈ సెంటర్ లో సాఫ్ట్ వేర్ ల ఏర్పాటుకు పలువురు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి’ అనే నినాదంతో టీ-హబ్ పనిచేస్తుందని అన్నారు. నవంబర్ 5 న ఈ భవనాన్ని ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, రతన్ టాటా హాజరు కానున్నట్లు మంత్రి చెప్పారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలు, సదుపాయాలతో దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ సెంటర్ సిద్ధమైందని, ఔత్సాహికులకు ఉచితంగా టీ హబ్ లో వర్క్ బేస్ కల్పిస్తామని కేటీఆర్ వివరించారు. టీ-హబ్ మూల ధనాన్ని రూ. 600 కోట్లకు పెంచడమే లక్ష్యమని, రాయదుర్గంలో టీ-హబ్ రెండో దశ నిర్మాణం చేపడతామన్నారు. దేశంలోని స్టార్టప్ లకు హైదరాబాద్ వేదిక అవుతుందని, అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, యూరప్ దేశాల్లోనూ టీ హబ్ బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *