
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. రతన్ టాటా గారు అద్భుతమైన ఆవిష్కర్త, దార్శనీకుడు, మహనీయుడని అని కొనియాడారు. రతన్ టాటా మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన ఆయన ఎంతోమందికి ప్రేరణ అని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో ఆయన లేని లోటు పుడ్చలేనిదన్నారు. దాతృత్వంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని గుర్తు చేశారు.
టీ-హబ్‌ను చూసిన ప్రతిసారీ, మేము మిమ్మల్ని గుర్తుంచుకుంటూనే ఉంటామని.. రతన్ టాటా టీ-హబ్‌ను సందర్శించిన సందర్భాన్ని కేటీఆర్ గుర్తు తెచ్చుకున్నారు.
ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చాలని కోరుకునే వారందరూ రతన్ టాటా స్ఫూర్తిని కొనసాగిస్తారని అన్నారు. అందరి హృదయాల్లో టాటా ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతారని కేటీఆర్ అన్నారు.
టాటా కుటుంబానికి, టాటా గ్రూప్‌కు, రతన్ టాటా గారితో అనుబంధం ఉన్నవారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.