
అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అంటే కేసీఆర్ అంటూ అదే శ్రీరామరక్ష అని దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న సామాజిక మాధ్యమ వీరులకు ధన్యవాదాలు. గత ఎడాదికారంగా ప్రభుత్వం అరాచకాలపైన అక్రమాలపైన స్కాంలపైన ప్రజల తరఫున పోరాడిన పార్టీ లీడర్లకి, పార్టీ శ్రేణులు అందరికీ అభినందనలు అని తెలిపారు.
ముఖ్యమంత్రి తన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి మరోసారి అప్పులనే తప్పుడు కూతలు కూస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సింది అప్పుల మీద కాదు చర్చ.. రేవంత్ చేసిన తప్పులపైన చర్చ జరగాలి. ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత సీఎం పదవికున్న పరువు తగ్గింది అని ఎద్దేవా చేశారు.
11 నెలలు పాలనలో అనుముల సోదరులకు మాత్రమే లాభం జరిగింది. 11 నెలలలోనే రాష్ట్రానికి రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి అనుముల సోదరులు ఎదిగారు. ఇదే పరిస్థితి ఉంటే వచ్చే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో రేవంత్ రెడ్డి సోదరులు చేరుతారు. దివాళా తీసింది రాష్ట్రం కాదు దివాళాకోరు ముఖ్యమంత్రి రావడం రాష్ట్రానికి దారుణం. కొత్త పరిశ్రమల మాట దేవుడెరుగు ఉన్న పరిశ్రమల తరలిపోతున్నాయి అని దుయ్యబట్టారు.
తెలంగాణ రైజింగ్ అని కొత్త నాటకానికి తెర లేపారు. అదీ తెలంగాణ రైజింగ్ కాదు అనుముల బ్రదర్స్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్, తెలంగాణ ఫెయిలింగ్. అబద్ధాలు, అసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ టెక్నికులు మాత్రమే.. మీడియా మేననెజ్‌మెంట్ తప్ప 11 నెలల్లో సీఎం చేసింది ఏమిటో చెప్పాలి. నువ్వు చేసిన తప్పులను దాచుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం, వదిలిపెట్టం అని హెచ్చరించారు.
గతంలో ఇండియా షైనింగ్ అన్న వాళ్ళు గతి లేకుంటే నువ్వు కూడా కొట్టుకుపోతావు. కారుకూతలతో, కుప్పిగంతులతో రేవంత్ టైంపాస్ చేశారు. నీ శ్వేతపత్రానికి బీఆర్ఎస్ స్వేదపత్రంతో సమాధానమిచ్చింది. అప్పులపై చెప్పిన అబద్ధాలకు సమాధానాలు చెప్పాం. ఇచ్చిన హామీలు అమలుకు చేయకుండా తప్పించుకునేందుకు అప్పులపై డ్రామాలు. అప్పుల మీద కాకుండా ఇచ్చిన హామీల అమలుపైన మాట్లాడాలి. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలపైన మాట్లాడాలి అని సూచించారు.
ఎన్నికల ముందు తెలంగాణ ఆర్ధిక పరిస్థితి తెలుసని టీవీల ముందు చెప్పావు. నాడు దొంగ మాటలు.. నేడు కారుకూతలు కూస్తున్నాడు. ఈ ఏడాదిలో ఏం పాలన చేశారో చెప్పండి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను తమవి అనే దివాళాకోరు తనం రేవంత్‌దీ. రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 12 వేల ఉద్యోగాలు మాత్రమే. రేవంత్ బండారం బయటపెట్టేలా రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. అశోక్‌నగర్ వచ్చి నిరుద్యోగులను నమ్మబలికి మోసం చేశారు. రాహుల్ గాంధీకి తెలిసి దొంగ నాటకాలు ఆడితే ప్రజల ముందు నిలబెడతాం. రేవంత్ రెడ్డి ఎన్ని తప్పుడు కూతలు కూసిన వదిలిపెట్టను అని స్పష్టం చేశారు.
ఇచ్చిన ఉద్యోగాలు, రుణమాఫీ, ఆరు గ్యారెంటీల మొదలు అన్ని అబద్ధాలే. రాష్ట్రంలో పాక్షికంగానే అమలు అయింది రుణమాఫీ. భట్టి విక్రమార్క ప్రకారం కేవలం రూ. 11,000 కోట్ల డబ్బులు కూడా రైతులకు అందలేదు డబ్బు సంచులతో దొరికిన దొంగ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు మొదలైనందుకు విజయోత్సవాలా? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నందుకు విజయోత్సవాలా? ఈ విజయోత్సవాలు చేస్తున్నారు సీఎం సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఎవరు చనిపోయిన అది ప్రభుత్వం చేసిన హత్యనే? అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసినవే. గురుకులాలు, ఆటో డ్రైవర్లు, నేతన్నలు చావులన్నీ ప్రభుత్వ హత్యలే. రాష్ట్రంలో హత్యలు పరంపర కొనసాగింపుగా పాలన చేస్తుంది. గురుకులాల విద్యార్థులను ఎవరెస్టు ఎక్కిస్తే.. అవే గురుకులాల విద్యార్థులను పాడే ఎక్కిస్తున్నారు. గురుకులాలకు సరైన నిర్వహణ చేయడం చేతకాక నాపై, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కుట్ర కేసులు పెడుతున్నారు. గురుకులాలను నిర్వహించలేని చేతగానితనానికి సీఎం సిగ్గుపడాలి అని కేటీఆర్ మండిపడ్డారు
విఫల రాష్ట్రం అయితదని చెప్పిన తెలంగాణ వ్యతిరేకుల మాటలను వమ్ము చేస్తూ విజయ తీరాలకు తెలంగాణను చేర్చాం. కొత్త రాష్ట్రం చిన్న రాష్ట్రమైన తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపాం. దివాళా తీసిందని దివాలాకోరు మాటలు పదేపదే మాట్లాడుతున్నారు. రేవంత్ చేతకానితనం వల్ల రాష్ట్రం అప్పులపాలైంది. రిజర్వ్ బ్యాంక్, సోషియో ఎకనామిక్ సర్వే నివేదికలు రాష్ట్రం సాధించిన ఆర్థిక ప్రగతికి మైలురాళ్లు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 ఖర్చు పెడితే రూ. 74 రూపాయలు కేవలం అభివృద్ధి పనులకు ఖర్చు పెడుతున్నారు. ఆదాయమంతా అప్పులకే పోతుందని రాష్ట్ర ప్రభుత్వం అనేక అబద్ధాలు చెబుతుంది అని విమర్శించారు.
రూ.100లో అప్పులకు, వడ్డీలకు పోతుంది రూ. 47 రూపాయలు మాత్రమే. 2012లో రూ. 364 కోట్లు మాత్రమే రాష్ట్ర రెవెన్యూ సర్‌ప్లస్ ఉండే.. రూ. 5,944 కోట్లు రెవెన్యూ సర్‌ప్లస్‌తో అప్పచెప్పినం. రెవెన్యూ రీసీట్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. అప్పుల పేరుతో ఇంకెవరైనా తప్పుడు కూతలు కూయడమంటే బడ్జెట్‌పై అవగాహన లేనట్లే. రాష్ట్రంలో అన్ని ఖర్చులు పోగా రూ. 5,944 కోట్ల మిగులు ఉంది. రూ. 7 లక్షల కోట్ల అప్పు అన్నది అతిపెద్ద అబద్ధం. అబద్ధానికి అంగీలాకు తొడిగితే అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. కేసీఆర్‌కి వేయి ఎకరాల ఫామ్ హౌస్ ఉందంటున్న రేవంత్.. రియల్ ఎస్టేట్ బ్రోకరా? అని ధ్వజమెత్తారు.
సీఎంకు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారు. పెట్టుబడి, సంక్షేమం కొరకు నేరుగాగా చేసిన అప్పు రూ. 4,26,499 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6,71,757 అప్పు చేసిందని పదే పదే చెబుతున్నరు. డిసెంబర్ 23నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారు. రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హామీ లేనివి, గవర్నమెంట్ కట్టనివి రూ. 59,414 కోట్లు. గవర్నమెంట్ హామీ ఉండి, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనివి రూ. 95,462 కోట్లు. మొత్తంగా గవర్నమెంట్ కట్టవల్సిన అవసరం లేని అప్పులు రూ. 1,54,876 కోట్లు అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న పాత అప్పు రూ. 72,658 కోట్లు.. ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్స్)ల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు రూ. 11,609 కోట్లు. గోబెల్స్ మించి ప్రచారం చేస్తున్నాడు. 11 నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా అప్పు చేశారు. 2024 డిసెంబర్ మూడో తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర కార్పొరేషన్ నుంచి 85 వేల కోట్ల అప్పు తీసుకుంది. ఈ లెక్క కేవలం ఆగస్టు నాటి వరకే.. ఆ తర్వాత కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలు ప్రభుత్వం మాయం చేసింది. రేవంత్ రెడ్డి ప్రతినెల రూ. 6500 కోట్లు వడ్డీలు, అప్పులు కడుతున్నామని చెప్తున్న మాట శుద్ధ తప్పు. బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకి రూ. 2900 కోట్ల చొప్పున 12 నెలలకి కడుతుంది రూ.34,730 కోట్లు మాత్రమే. రేవంత్ చెప్తున్న దాని ప్రకారం నెలకు రూ. 3,600 కోట్లు ఎక్కడ పోతున్నట్లో కాంగ్రెస్ ప్రభుత్వ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ఇది కాకుండా కాగ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికి కట్టింది రూ. 15,152 కోట్లు మాత్రమే.. నెలకు రూ. 2,164 కోట్లు మాత్రమే. ఒక్క హామీ నెరవేర్చకుండా.. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా.. తెలంగాణ ఆదాయం ఎటు పోతున్నట్టు. బ్రదర్స్ జేబుల్లోకి వెళుతోందా, ఢిల్లీ పెద్దల ఖజానా నిండుతోందో చెప్పాలి. రేవంత్ రెడ్డి చేసిన అప్పు ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్ జేబులోకి పోతుందా? లేదంటే ఢిల్లీకి సంచులలో పోతుందా? అని అడిగారు.
గత 60 సంవత్సరాల్లో రాష్ట్రం చేసిన అప్పుని రేవంత్ రెడ్డి కేవలం 11 నెలల్లో చేశారు. 60 ఏళ్ల అప్పుని కేవలం ఒక్క సంవత్సరంలోనే దాటిన రేవంత్.అప్పుల పేరుతో తప్పుడు కూతలు కూ.. అబద్ధాలు చెబుతూ. ప్రజలను తప్పుదువ పట్టిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. పదవులపై మోజుతో ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏమైనా తప్పు పట్టిస్తున్నారో చూడాలి. రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చెప్పే లెక్కలకు పొంతనలేదు. ఎవరు చెప్పే లెక్కలు కరెక్టో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి అని అన్నారు.
అప్పులు తెచ్చి మేము ఆస్తులు నిర్మాణం చేశాం.. లక్ష కోట్ల అప్పు తెచ్చి నువ్వు ఒక్క ఇటుక అయినా పేర్చలేదు. కట్టడం పక్కన పెట్టి కూల్చడమే ఏజెండాగా 11 నెలలు పనిచేశారు. కోకాకోలా కంపెనీని ఫోజులు కొట్టి సీఎం ప్రారంభించారు.. మరి ఈ లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో సీఎం చెప్పాలి. లక్ష కోట్ల రూపాయల అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ముసలివాళ్ల పెన్షన్ ఎగ్గొట్టారు.. రైతు భరోసా ఎగొట్టారు.. ఆడబిడ్డలకు మహాలక్ష్మి ఎత్తగొట్టారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తున్నాను అని చెప్పి మోసం చేశారు. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం మానుకోవాలి అని పేర్కొన్నారు.
ఇచ్చిన 420 హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఇబ్బందుల పాలవుతున్న సబ్బండ వర్గాలను ఆదుకుని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలను నమ్మి సంబరాల పేరుతో గోల్‌మాల్ కావొద్దు.. మీడియా జాగ్రత్తగా ఉండాలి. కాళేశ్వరం లేకుండా రికార్డు స్థాయిలో పంటలు పండించినమని చెప్తున్న కాంగ్రెస్.. 2014 ముందు ఎందుకు పంటలు పండించలేదు. నాడు ప్రాజెక్టులు ఉన్నా పంటలు పండించని దానిపై కాంగ్రెస్ సన్నాసి ముఖ్యమంత్రి, దద్దమ్మ మంత్రులు జవాబు ఇస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
గత పది సంవత్సరాలలో రైతన్న ముఖచిత్రాన్ని మార్చిన మా ప్రభుత్వం వల్లనే రికార్డు. సన్నాలకు బోనస్ ఇచ్చిన అని చెప్పి రైతుబంధు ఎగ్గొట్టిన తీరు గురించి.. రాష్ట్రంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రికి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నిజాలను దాచిపెడుతుంది.. అందుకే సమాచార హక్కు చట్టం ప్రకారం ఇచ్చిన అప్లికేషన్లను సమాధానం చెప్పడం లేదు. వాస్తవాలు బయటకు రావద్దన్న ఉద్దేశంతోనే గురుకులాలలోకి మా విద్యార్థి నాయకులను పోనివ్వడం లేదు అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పింది. మరి అన్ని చోట్ల ఫార్మా విలేజిలను రద్దు చేస్తున్నారా లేదా అనేది చెప్పాలి. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలసీనా లేదా కొడంగల్‌కేనా అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. రెండు పంటలు పండే భూములను భూసేకరణ చేయొద్దని రేవంత్ రెడ్డి గతంలో అనేకసార్లు అసెంబ్లీలో చెప్పాడు. 80 శాతం మంది రైతులు ఒప్పుకోకుంటే భూసేకరణ చేయవద్దు అన్నాడు. డీపీఆర్ లేకుండా భూసేకరణ చేయొద్దు అని చెప్పిండు.. మరి కొడంగల్‌లో ఆదానీ వస్తాడా? అల్లుడి కంపెనీ వస్తుందా? తెలవకముందే భూసేకరణ ఎందుకు చేస్తున్నాడు. తొండలు గుడ్లు పెట్టని భూములు అన్న ముఖ్యమంత్రి.. గిరిజన అమ్మాయి ఇచ్చిన సమాధాన గుర్తుంచుకోవాలి. కొడంగల్ నిజాలు బయటకు రావద్దని అక్కడికి ఎవరిని వెళ్ళనీయడం లేదు.. రైతులు ఒప్పుకుంటే తీసుకో కానీ ఒప్పుకోకుంటే ఎట్లా తీసుకుంటావు? అని అడిగారు.
ముఖ్యమంత్రి నియంతలా పాలన చేస్తున్నాడు.. ఉన్న సిటీని నాశనం చేయకుంటే చేస్తున్నాడు. ఫోర్త్ సిటీ ఎందుకు.. నడుస్తున్న ఎస్ఆర్డీపీని నాశనం అవుతుంది.. వాటర్ వర్క్స్ పనులన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని అధికారులే స్వయంగా చెబుతున్నారు. కేవలం భూసేకరణ వల్లనే ఒక నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదు. హైదరాబాద్ నగరం ఈ స్థాయికి రావడానికి 400 సంవత్సరాలు పట్టింది. రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే.. అందుకు మించి పరిపాలన చేయడం చేతకావడం లేదు అని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి కుటుంబానికి 500 ఎకరాల కోసమే భూసేకరణ.. భూసేకరణ ఎందుకు చేస్తున్నారు కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. 15 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పుడు.. మళ్ళీ 15 వేల ఎకరాలు ఎందుకు? కొండారెడ్డిపల్లిలో, వెల్దండలో ఉన్న 400 ఎకరాలు భూమిని ఫోర్త్ సిటీకి ఇస్తారా చెప్పాలి? 20 లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల భూములు ఇస్తారా? బీఆర్ఎస్ పార్టీ తరఫున మరో ఐదు లక్షల అదనంగా ఇస్తాం? రేవంత్ రెడ్డి భూములు ఇస్తారో లేదో చెప్పాలి. రేవంత్ కుటుంబానికి ఒక నీతి గిరిజనులకు ఇంకొక నీతా? అనే విషయాన్ని చెప్పాలి అని ఫైర్ అయ్యారు.
క్యాబినెట్ విస్తరణ జరిగితే బాంబులు పేలుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. క్యాబినెట్ మినిస్టర్‌కు ఉన్న పరపతి కూడా ఢిల్లీలో లేదు. అనేక కీలకమైన శాఖలకి మంత్రులు లేరు.. మంత్రివర్గ విస్తరణ చేసే పరిస్థితి లేదు. నాలుగు సంవత్సరాల తర్వాత సచివాలయం ఎదురుగా రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. దేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం తల్లి ఘనంగా, గొప్పగా ఉండాలి.. పేదరికంలో తాండవించేలా మా తెలంగాణ తల్లి ఉండదు. చూడగానే దండం పెట్టేంత గొప్పగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటది.. అంత గొప్పగా విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. మా తెలంగాణ తల్లి ఘనంగా ఉండేలా చూస్తాం అని తెలిపారు.