శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్..

  • February 16, 2021 5:02 pm

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం మహబూబ్ నగర్ పట్టణం శ్రీనివాస కాలనీలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి చేరుకున్న మంత్రి కేటీఆర్ నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నారాయణ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ వెంట మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, కే. లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 


Connect with us

Videos

MORE