సమైక్య పాలనలో కరువు కాటకాలకు.. వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా మారింది. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో.. పడావుబడ్డ పాలమూరు నేల.. పసిడి పంటలతో సస్యశ్యామలమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ, మరియు ఇతర పార్టీల అసమర్థత వల్ల వెనుకపడేయబడ్డ పాలమూరు ప్రాంతం.. కేసీఆర్ పరిపాలనలో సుభిక్షంగా మారింది. మహబూబ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డ గులాబీ జెండా.. ఈ గడ్డపై మరోసారి ఎగరాల్సిన సమయం వచ్చింది అని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి, పాలమూరు ముద్దుబిడ్డ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్‌నగర్ ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు అని తెలిపారు.
రైల్వే స్టేషన్ల సుందరీకరణ, కొత్త రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన హయంలో సాధించారు.. లోక్‌సభలో సుమారు రెండు వందల చర్చల్లో పాల్గొని.. మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారు అని గుర్తు చేశారు.
ఎంఎస్ఎన్ ఫౌండేషన్ ద్వారా కరోనా కష్టకాలంలో మరియు ఇతర సమయాల్లో నిరుపేదలకు అండగా నిలిచారు.. మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి గళం.. మహబూబ్‌నగర్‌కి బలం అని కేటీఆర్ కొనియాడారు.