mt_logo

కష్ట సమయంలో అన్నీ తానై.. కవితకు అండగా కేటీఆర్

అన్న అంటే అమ్మ + నాన్న అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుజువు చేశారు. కష్ట సమయంలో తన తోబుట్టువుకు అన్నీ తానై అండగా నిలిచారు.

అక్రమ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు రంగం సిద్ధమైన క్షణం నుండి జైలు నుండి విడుదలయ్యేవరకు కేటీఆర్ అనుక్షణం తోడు నీడగా నిలిచారు.. ఒక అన్నగా తన బాధ్యతలను నిర్వర్తించారు. ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ వ్యారంట్‌లోని లొసుగులను కేటీఆర్ ఎత్తి చూపించిన తీరు అప్పట్లో అందరిని ఆకర్షించింది.

కవిత లీగల్ వ్యవహారలన్ని దగ్గరుండి చూసుకోవడమే కాక.. మధ్యమధ్యలో తీహార్ జైలుకు వెళ్లి తన చెల్లెలికి భరోసానిచ్చారు.. కుటుంబానికి కవితకు మధ్య వారధిగా నిలిచారు. తన సోదరి జైల్లో ఉన్నప్పటికి.. ఆ కేసును ఎప్పుడు కూడా సెంటిమెంట్ రాజకీయాల కోసం వాడలేదు.. జైల్లో కవిత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఎక్కడా ఎక్కువగా ప్రస్తావించలేదు అంటే ఈ కష్టకాలంలో కేసీఆర్ కుటుంబం ఎంత హుందాగా ప్రవర్తించింది అనేది స్పష్టమైతుంది.

ఇటీవలే రాఖీ పండుగ నాడు కూడా.. ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టలేకపోయినా.. ఎలాంటి కష్టంలోనైనా నీకు జీవితాంతం తోడుంటా అని కవితనుద్దేశించి చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంది.. వాళ్లిద్దరి మధ్యనున్న ఆత్మీయ బంధాన్ని చాటి చెప్పింది. 

కోర్టుల్లో బెయిల్ కోసం కృషి చేయడం నుండి కుటుంబాన్ని ధైర్యంగా ఉంచడం వరకు.. కవిత ఎపిసోడ్‌లో కేటీఆర్ పోషించిన పాత్ర ప్రతీ అన్నకి, ప్రతీ కొడుకుకి స్ఫూర్తిదాయకం. 

ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడిగా ఇప్పటికే పేరొందిన కేటీఆర్.. ఇప్పుడు తన రక్తసంబంధీకులు కోసం పోరాడిన విధానంతో ఒక మెట్టు పైకి ఎదిగారు.