mt_logo

పురాతన మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మెహిదీపట్నంలోని బాపూఘాట్‌లో పురాతన పుష్కరిణి బావిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. వందల ఏళ్ల పూర్వపు ఈ బావిలో బాపూజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ సమాధి, ధ్యానమందిరం నిర్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన బావిని జీఎంఎస్‌ స్వచ్ఛంద సంస్థ పునరుద్ధరించింది. కేటీఆర్‌ ఈ బావిని ప్రారంభించి.. ఇందులో గంగా జలాన్ని, తాబేళ్లను వదిలి, అనంతరం ఏర్పాటు చేసిన ఖవ్వాలిని తిలకించారు. పురాతన కట్టడాల పరిరక్షణకు గండిపేట వెల్ఫేర్‌ సొసైటీ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌లు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *