నిజామాబాద్ సభలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన అసత్య ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి… ప్రధానమంత్రి అబద్ధాల ప్రచారకర్త. ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, 15 లక్షల రూపాయలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతానని ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అని అన్నారు
ప్రధానమంత్రి స్థాయిని తగ్గించేలా నరేంద్ర మోడీ మాట్లాడాడు. రాజకీయాల కోసం ఇంత నీచనికి దిగజారిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు.. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక అధికారిక సమావేశాలను నీచమైన రాజకీయాలకు ప్రధానమంత్రి వాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి అబద్ధాల తర్వాత ప్రతి అధికారిక సమావేశానికి ఒక కెమెరాని పట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నది. తనకు అలవాటైన అబద్దాలకు అనుగుణంగా మోడీ రాజకీయాలు చేస్తున్నారు.. విద్య అర్హతల విషయంలోనే అబద్దం చెప్పిన ప్రధానమంత్రి మాటలను ఎవరు నమ్ముతారు అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడడం దురదృష్టకరం..ఇంతకంటే బాధాకరం శోచనీయం ఇంకోటి లేదు. ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం వెళ్లి అబద్దాలు ఆడడం ప్రధానమంత్రికి అలవాటు అయింది అని అన్నారు.
బెంగాల్ వెళ్తే మమతా బెనర్జీ పైన, ఒరిస్సా వెళ్తే నవీన్ పట్నాయక్ పైన, మేఘాలయ వెళ్తే సంగ్మా పైన అబద్దాలు చెప్పారు.. ఆ తర్వాత వారితోనే పొత్తులు పెట్టుకుంటారు. ఈ ప్రధానమంత్రి కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని చెప్తున్నారు.. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదు అని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రితో ఉంటే మంచివాళ్లు… ప్రకాశ్ బాదల్- సుబ్బి సింగ్ బాదల్ వంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోలేదా.. కాశ్మీర్లలో ముఫ్తీ మహమ్మద్ సహిద్ కుమార్తే తో పొత్తు పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు లోకేష్ గారితో కలిసి పని చేయవచ్చు ఎన్డీఏలో ఉండవచ్చు. బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ థాక్రే తో కలిసి బీజేపి పొత్తు పెట్టుకోవచ్చు . అప్పుడు రాజులు యువరాజులు గుర్తుకురారు. జనతాదళ్ సెక్యూలర్ దేవేగౌడ, వారి కుమారుడు కుమారస్వామితో పొత్తు పెట్టుకోవచ్చు.. మీతో ఉంటే వారసత్వ రాజకీయాలు గుర్తుకు రావు లేదంటే గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి పచ్చి అబద్దాలకోరు.. బీజేపీ జూటా ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా, జూటా పార్టీ ఆఫ్ ఇండియా. బీజేపీ ఒక వాట్సాప్ యూనివర్సిటీ. ప్రధానమంత్రి కథలు చెప్పడంలో ఆరితేరినారు, ఆయన సినిమా కథలు రాయడం ప్రయత్నించాలి అని అన్నారు
పార్టీలని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఎన్డీయేలో చేరాల్సిన అవసరం ఎవరికీ లేదు… ఎన్డీయే ఒక మునిగిపోతున్న నావా.. ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు అని అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి బీఆర్ఎస్ బీజేపికి బీ టీం అంటాడు… కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నమని ప్రధానమంత్రి అంటాడు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కి డబ్బులు వస్తుంటే కేంద్ర ఐటి శాఖ కానీ ఇతర శాఖలు కానీ నిద్రపోతున్నాయా అని ప్రశ్నించారు.
పిచ్చికుక్క కరిచిన వారైతెనే ఎన్డీఏలో చేరుతారు.. ఒకవైపు పార్టీలన్నీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మేము ఎన్డీయేతో ఎందుకు వెళ్తాం.. ఈడీ, సీబీఐ తప్ప ఇంకెవరు మీతో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న హేమంత్ బిశ్వశర్మ పైన ఉన్న కేసు మీ పార్టీలో చేరినాక ఏమైంది అని అడిగారు.
నారాయణ రానే, జ్యోతిరాదిత్యా సిందియ వంటి వాళ్ళ పైన ఉన్న కేసులు మీ పార్టీలో చేరినాక ఏమైనాయి.. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి, మంత్రులు.. జ్యోతిరాదిత్య సింధియా ఎవరు, జై షా ఎవరో, అనురాగ్ ఠాకూర్ ఎవరో చెప్పాలి అని అన్నారు.
కేసీఆర్ ఒక ఫైటర్, ఆయన నరేంద్ర మోడీ లాంటి చీటర్ తో కలిసి పని చేయరు. మేము ఢిల్లీ బానిసలం, గుజరాత్ బానిసలం కాదు.. రెండుసార్లు మేము ప్రజాస్వామికంగా ప్రజలల్లో గెలిచిన వ్యక్తులం… గుండెలు చించుకొని అరిసినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవు అని అన్నారు.
మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించేది ప్రధానమంత్రి కాదు… మా పార్టీ ఎమ్మెల్యేలు అనే విషయం ప్రధానమంత్రికి తెలియదు. తెలంగాణ ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ని ఎన్నుకోవడానినికి రెడీ ఉన్నారు అని అన్నారు.
ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు.. గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బిజెపి డిపాజిట్ గల్లంతయింది. బీజేపీకి కానీ ప్రధానమంత్రికి కానీ దమ్ముంటే ఈసారి 110 స్థానాల్లో తమ డిపాజిట్లు గల్లంతు కావు అనే సవాలుకి సిద్ధం కావాలి అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో పొలిటికల్ టూరిస్టులైన బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు వివరించాలి. ప్రధానమంత్రి నీతిమంతునన్ని మాట్లాడుతారు. మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీని అదాని విషయంలో ఎందుకు వేయలేరు. ఈ విషయంలో ఎందుకు వెనక్కి వెళ్లారు అని ప్రశ్నించారు.
శ్రీలంక ప్రధాన మంత్రితో రూ. 6,000 కోట్ల అదాని కాంట్రాక్ట్ గురించి మాట్లాడిన ప్రధానమంత్రి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకుండా ఎందుకు ఆగారు.. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడిన… తెలంగాణ ప్రజలకు 9 సంవత్సరాలలో బీజేపీ ఏమి చేయలేదని అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుండు సున్న.. మీకు వచ్చేస్థానాలు కూడా గుండు సున్నా అని అన్నారు.చివరిదాకా నిలబడతాం, బీజేపీతో కొట్లాడుతాం.. ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతాం అని మంత్రి స్పష్టం చేశారు.
చివరిదాకా నిలబడతాం, బీజేపీతో కొట్లాడుతాం.. ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతాం అని మంత్రి స్పష్టం చేశారు.