mt_logo

3,052 మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన కేటీఆర్..

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు 3,052 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇళ్ళ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లలో అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఇళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు మావద్ద ఉన్నాయన్నారు. ఇళ్ళ గురించి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, దళారుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఇల్లు లేనివారు ఉండకూడదనేది సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని, మిగతా 248 మందికి కూడా త్వరలోనే ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు.

సిరిసిల్లలో త్వరలోనే రూ. 200 కోట్లతో రహదారి, భూగర్భ కాల్వల పనులు చేపడతామని, సిరిసిల్ల నియోజకవర్గానికి జలకళ రాబోతుందని అన్నారు. సిరిసిల్ల చేనేతకారులు తయారుచేసిన బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం. బతుకమ్మ చీరల్లో మరిన్ని డిజైన్లు తీసుకువస్తాం. నేతన్నలకు, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఐదేళ్ళలో సిరిసిల్లను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే నంబర్ వన్ గా మారుస్తా. అపూర్వమైన విజయాన్ని నాకు అందించిన సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకోలేనిది. సీఎం కేసీఆర్ కార్యదక్షత వల్లే సిరిసిల్లకు చెందిన బీడీ, నేత కార్మికుల 40 ఏళ్ల కల నెరవేరబోతుంది. జీవో నం. 58 కింద లక్షా 25వేలమందికి పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని వివరించారు. దేశం మొత్తం అబ్బురపడేలా రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *