తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావుతో ఐటీ ఉద్యోగులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్ లో ఐటీ విస్తరణ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచే ప్రతిపాదనలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఐటీఐఆర్ ప్రాజెక్టుపై వివరాలను ఇండస్ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా కాన్సులేట్ అధికారులతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు.
మరోవైపు కేంద్రం ఇచ్చే పన్ను రాయితీ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని, ఈ అంశం రాష్ట్ర ఏర్పాటు బిల్లులో స్పష్టంగా ఉందని కరీంనగర్ ఎంపీ బీ వినోద్ స్పష్టం చేశారు. పన్ను రాయితీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అన్నది నిజం కాదని, పారిశ్రామిక వేత్తలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన కోరారు.