ఫైళ్ళ శేఖర్ రెడ్డిని ప్రశంసించిన కేటీఆర్!!

  • August 17, 2020 1:50 pm

భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి కరోనా ఆపద సమయంలో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ నిధులతో పాటు సొంత ఖర్చులు కలిపి సుమారు రూ. 50 లక్షలతో బీబీ నగర్ ఎయిమ్స్ లో 50 పడకలతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివారం జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, ఎంపీపీ సుధాకర్ గౌడ్ లతో కలిసి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో పది బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం, రెండు వెంటిలేటర్లను సమకూర్చినట్లు తెలిపారు. 10 మంది వైద్యులు, 12 మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తారని, ఆస్పత్రికి అనుసంధానంగా 3 ప్రైవేట్ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కోవిడ్ బాధితులు టోల్ ఫ్రీ నంబరు. 18004257106 కు ఫోన్ చేసి తగిన సేవలు పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఇదిలాఉండగా కరోనా ఆపత్కాలంలో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి చేసిన కృషిని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.


Connect with us

Videos

MORE