mt_logo

కిరణ్, చంద్రబాబుపై కోమటిరెడ్డి ఫైర్!

తెలంగాణ పై ఎప్పటికప్పుడు మాటమారుస్తూ ఊసరవెల్లుల్లా చంద్రబాబు, సీఎం కిరణ్ వ్యవహరిస్తున్నారని నల్గొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో కోమటిరెడ్డి మాట్లాడుతూ, సీఎం కిరణ్ కేవలం సీమాంధ్రకే ముఖ్యమంత్రి అనీ, ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు చెప్పారని అన్నారు. తెలంగాణ రైతుల భూములు లాక్కున్న జీఎమ్ఆర్ కంపెనీలో 4000 మంది ఉద్యోగులు ఉండగా అందులో తెలంగాణ వారు 400 కూడా లేరని, హైదరాబాద్ లో ఉన్న కంపెనీలన్నీ ఆంధ్రా ప్రాంతానికి చెందినవారివే అని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలమని చాలాసార్లు లేఖ ఇచ్చి కేంద్రం నుంచి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం రాగానే యూటర్న్ తీసుకున్నారని, సమన్యాయమని డిమాండ్ లేని దీక్షను చేసి డిల్లీలో అభాసుపాలయ్యారని గుర్తుచేశారు. ఇలా ఎన్నిసార్లు మాటమారుస్తారని అంటుండగా ఎర్రబెల్లి అడ్డుకుని మైక్ కావాలని అడుగగా, తెలంగాణపై మాట మార్చినందుకు తెలంగాణ ప్రజలు నీకు తగిన బుద్ది చెబుతారని కోమటిరెడ్డి హెచ్చరించారు. నాగార్జునసాగర్ నల్గొండ జిల్లాలోనే ఉన్నా కనీసం తాగడానికి చుక్క నీరు లభించే పరిస్థితి లేదని, ఇదే తెలంగాణ దయనీయస్థితి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *