అద్భుతం! ఒకేచోట 15,660 రెండు పడక గదుల ఇళ్ళ డ్రోన్ దృశ్యం: కేటీఆర్ ట్వీట్

  • September 12, 2021 8:29 pm

ఒకేచోట వేల సంఖ్యలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల అద్భుతమైన డ్రోన్ చిత్రాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇప్పుడీ చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 15,660 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది. ఓఆర్ఆర్ కు అతి సమీపంలో, పెద్దసంఖ్యలో, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో, నిర్మాణాలను అనుకుని వెళ్తున్న రహదారితో కూడిన చిత్రాలను చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. వీటిని త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారని.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.


Connect with us

Videos

MORE