mt_logo

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి ఉత్సవాలు

తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజి జయంతి ఉత్సవాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 09 సెప్టెంబర్ 2021 రోజున గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు వర్చువల్ గా ఘనంగా జరుపుకున్నారు.

ఈ సంబరాలలో కెనడాలో నివసిస్తున్న దాదాపు 100 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేశారు. మొదట జనరల్ సెక్రెటరీ శ్రీ దామోదర్ రెడ్డి మాది గారు కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ముఖ్య అతిథిగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి అపూర్వ శ్రీవాత్సవ గారు తమ సందేశాన్ని తెలుగులో తెలియజేసారు. అలాగే మరొక ముఖ్య అతిథి తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖా డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారు కాళోజి జీవిత శైలిని, తెలంగాణ భాషా దాని పుట్టుపూర్వోత్తరాలను, మాండలికాలను, వాటి మూలాలను వినిపించగా సభికులు ముగ్దులయ్యారు.

 

ఈ కార్యక్రమ సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి కవిత తిరుమలాపురం గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ దర్శకుడు శ్రీ గిరిధర్ గారు తెలంగాణ భాష మరియు కాళోజి పద్యాలు, రచనల రాత పోటీలు నిర్వహించి.. శ్రీమతి శ్రీదేవి పెద్ది, శ్రీ హరికృష్ణ, ఒళ్లాల, శ్రీధర్ పత్తిపాక మరియు ఉష మాధురి గార్లకు శ్రీమతి అపూర్వ శ్రీవాత్సవ గారిచే బహుమతుల ప్రకటన జరిపారు. మరో 14 మంది చిన్నారులు కాళోజి పద్యాలు, రచనలు వినిపించగా.. వారందరికీ ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. ఈ కార్యక్రమ అధ్యక్షులుగా శ్రీ రాజేశ్వర్ ఈద గారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా శ్రీ సంతోష్ మన్నెం గారు, కోశాధికారి శ్రీ నవీన్ ఆకుల గారు మరియు కార్యవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు వందన సమర్పణ చేస్తూ ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *