mt_logo

ఖమ్మం ఐటీ హబ్ పనితీరు భేష్ : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరాల్లో ఏర్పాటైన ఐటీ హబ్‌ల్లో గా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. మంగళవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కేటీఆర్‌ని కలిసి ఖమ్మం ఐటీ హబ్ ప్రథమ వార్షిక నివేదిక 2021 ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు టాస్క్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ 1,45,522 కోట్లుగా నమోదైందని, రాష్ట్రంలో ఐటీ రంగంలో 6,28,615 మందికి ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ ని విస్తరిస్తున్నామని, ఇప్పటికే ఈ నగరాల్లో 1800 స్టార్టప్స్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ఐటీ రంగంలోనూ ఖమ్మంకు ప్రథమ స్థానం లభించిందని అన్నారు. వారి కృషితో ఖమ్మంతో పాటు ఇతర ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయన్నారను. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారని, మంత్రి కేటీఆర్ చొరవతో నేడు ఐటీ హబ్‌ల్లో ఖమ్మం టాప్ వన్ గా నిలిచిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *