ఈ నెల 9న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఏప్రిల్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి గులాబీ బాస్ సిద్ధమౌతున్నారు. అయితే అసెంబ్లీ స్థానానికి తన సొంత జిల్లా మెదక్ లోని గజ్వేల్ నుండి పోటీ చేయనుండగా, పార్లమెంటుకు ఎక్కడినుండి పోటీ చేస్తారనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు 8వ తేదీన సిద్దిపేట నియోజకవర్గం నుండి నామినేషన్ వేయనున్నారని తెలిసింది. ఈ నెల 4న టీఆర్ఎస్ పార్టీ 70మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ప్రకటించనుంది. వేరే పార్టీలతో పొత్తు కుదిరినా, కుదరకపోయినా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీనేతలు అభిప్రాయపడుతున్నారు. అదేరోజు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని, అభ్యర్థులకు బీఫారాలు అందజేయాలని నిర్ణయించారు. వారందరితో ఉద్యమంలో భాగస్వామ్యమైనట్లుగానే తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమౌతామని ప్రతిజ్ఞ చేయించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలిసింది. కేకే నివాసంలో నిన్న జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ పొత్తుల కమిటీ, ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొని అభ్యర్థుల జాబితాపై చర్చించిన అనంతరం కేసీఆర్ ను కలిసి చర్చల్లో వచ్చిన అనేక అంశాలను ఆయనకు విశదీకరించారు.
- CAG data exposes false claims of Congress on interest payments
- Thanks to KCR, Telangana emerges as best inland fish state
- NHRC takes cognizance of Lagacharla issue; seeks report from CS, DGP
- Pharma companies taking over fertile lands of tribals in Kodangal
- Congress govt. stops providing snacks to 10th students in special classes
- మహారాష్ట్రలో 5 గ్యారంటీల కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్ రావు
- దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని తేలిపోయింది: కేటీఆర్
- తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు.. అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కారు: కేటీఆర్
- త్వరలో కుల గణన డెడికేటెడ్ కమీషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక
- అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా?: కేటీఆర్
- నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం రేవంత్‌కి అలవాటు: హరీష్ రావు
- మహాధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌కి చెంపపెట్టు: సత్యవతి రాథోడ్
- రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు: హరీష్ రావు
- అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
- రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నాడు: హరీష్ రావు