mt_logo

కేసీఆర్ ను చంపుతామని బెదిరింపు లేఖ

టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును కాల్చి చంపేస్తామంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తులు తెలంగాణ భవన్‌కు ఓ లేఖ పంపడం తీవ్ర సంచలనం సృష్టించింది.

గతవారమే కేసీఆర్‌ ను చంపడానికి బెంగులూరు కేంద్రంగా కుట్ర జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ తాజా లేఖతో నిజంగానే కేసీఆర్ కు హాని తలపెట్టేందుకు కొందరు ముష్కరులు ప్రయత్నిస్తున్నారని స్పష్టమయ్యింది.

సోమవారం వచ్చిన ఈ లేఖ తెలంగాణవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. “కాన్ఫిడెన్షియల్, అర్జంట్” అని ఉన్న కవర్‌ సోమవారం నాడు తెలంగాణ భవన్‌కు భట్వాడా అయ్యింది. ఆ కవర్‌ను అక్కడి సిబ్బంది విప్పిచూడగా అందులో..

‘కేసీఆర్ నువ్వు పది రోజుల్లో కాల్చి చంపబడతావు -ఎల్‌ఈటీ ఆంధ్రా నక్సల్ (KCR You will be shot dead within 10 days -LET Andhra Naxal) అని రాసి ఉంది. దీంతో ఆందోళన చెందిన తెరాస నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *