mt_logo

ఫలిస్తున్న కేసీఆర్ స్ట్రాటజీ. హుజూరాబాద్‌లో పెరుగుతున్న టీఆర్ఎస్ హవా.

కేసీఆర్..ఎన్నికల మాంత్రికుడు.. ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు కాదు కదా..ఆయన పక్కన ఉన్నవారికి కూడా అర్థం కావు..ఎన్నో డక్కా మొక్కీలు తిన్న తర్వాత కేసీఆర్ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో తిరుగులేని స్టేజీకి చేరుకున్నారు.. అందుకే ఆయన టేకప్ చేసిన ఏ ఎన్నికా ఓడిపోయిన చరిత్ర లేదు… ఇప్పుడు మరోసారి హుజురాబాద్ ఎన్నికల్లో అది రుజువు కాబోతోందా..?? మొదట్లో ఈటెల మీద ఉన్న సానుభూతి గాలి క్రమంగా మళ్లుతూ టీఆర్ఎస్ గాలి వీస్తోందా..అంటే విశ్లేషకులు అవుననే అంటున్నారు..

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఫలితం మీద స్పష్టత వస్తోంది అంటున్నారు.. గత ఐదు నెలలుగా క్రమక్రమంగా జనంలోకి చొచ్చుకుపోయిన టీఆర్ఎస్ నేతల కృషి ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది..
మొదట నియోజకవర్గంలో మండలాల వారిగా వచ్చిన ఇంఛార్జులు నియోజకవర్గంలోని సమస్యల మీద దృష్టి సారించారు.. ప్రజలు అడిగిన ప్రతీ పనినీ పూర్తి చేశారు.. ఆ తర్వాత కులాల వారిగా వారికున్న సమస్యల మీద దృష్టి సారించారు.. వారికున్న సమస్యల్ని పరిష్కరించారు..

ప్రతీ కులానికి చెందిన నేతలకు ఏదో ఒక పదవి కట్టబెట్టారు.. ఆ తర్వాత పథకాల అస్త్రాన్ని ప్రయోగించారు..ప్రధానంగా దళిత బంధుతో కేసీఆర్ మొదటి జర్క్ ఇచ్చారు.. అప్పటిదాకా ఈటెల గురించి మాట్లాడుకున్న ప్రజలు దళితబంధు తో పూర్తిగా టర్న్ అయ్యారు..

కులాల వారిగా తమకేం ప్రయోజనం కలుగుతోంది అని ఆలోచించడం మొదలుపెట్టారు..అంతా ఇక కేసీఆర్ వైపు చూడటం మొదలుపెట్టారు.
బీసీ జన గణనకు కూడా సై అంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం..

అప్పటిదాకా ఈటల గురించి ఏకపక్షంగా మాట్లాడిన జనం కూడా సైలెంట్ అయిపోయారు. పథకాల పట్ల ఆకర్శితులవడం మొదలుపెట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే బీజేపీ తాము స్నేహితులమే అనేలా కేసీఆర్ ఢిల్లీలో జరిపిన రాజకీయం కూడా బీజేపీ నేతల్ని అయోమయంలో పడేసింది.

దీనికి తోడు ఇటీవల అమలులోకి వచ్చిన ఎలక్షన్ కమిషన్ నిబంధన కూడా కేసీఆర్ కు కలిసి వస్తుంది.. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చు అనే నిబంధన టీఆర్ఎస్ కు వరంలా కలిసి రావచ్చు.. ఈ వర్గాలు టీఆర్ఎస్ పథకాలతో ఎంతో సంతృప్తిగా ఉన్నాయి..

ఈ నేపథ్యంలో దాదాపు 12 వేల పోస్టల్ ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్ని శాసించనున్నాయి.. అవి కూడా టీఆరెఎస్ గెలుపులో భాగం కాబోతున్నాయి
ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న దాదాపు 60 వేల ఓట్లలో చాలా వరకు టీఆర్ఎస్ వైపు మళ్లే అవకాశం ఉంది.

అధికార పార్టీ ఉండేనే పథకాలు.. ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే స్పృహ జనంలో కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు..

ఎందుకంటే ఇప్పటిదాకా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న ఈటెల ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా కట్టివ్వలేదు. మరి ఈ సారి గెలిస్తే ఆ కల
ఎన్నటికీ సాకారం కాబోదన్న ఆలోచన ఓటర్లలో ఉండొచ్చు.

ఇటు దళిత ఓటర్లు.. డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులు..వృద్దులు..వికలాంగులు.. చీలిపోయే బీసీ ఓట్లు గెల్లు శ్రీనివాస్ ను విజయ తీరాలకు చేర్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకుల భావన. దానికి తోడు సిలిండర్ ధరలు, పెట్రో ధరల వల్ల బీజేపీకి నెగెటివ్ కాబోతున్నాయి.. ఇక ఏం సాధించినా ఈటెల తన సొంత ఇమేజ్ మీదనే ఓట్లు సాధించాలి. మరి కేసీఆర్ ను తట్టుకోవడం ఆయన వల్ల అవుతుందా.. చూద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *