గత ఆగస్టులో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
సీఎం ప్రకటించిన విధంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో గల ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల నిధుల చొప్పున నాలుగు నియోజకవర్గాలకు మొత్తం రూ.40 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసిన సీఎం కేసిఆర్ చర్య హర్షణీయం అన్నారు చేవెళ్ల ఎంపీ డా.రంజిత్ రెడ్డి.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రదాత సీఎం కేసిఆర్ కు ప్రజల పక్షాన రుణపడి ఉంటామని తెలియచేస్తూ… వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని రంజిత్ రెడ్డి అన్నారు.