mt_logo

ముడుపు విప్పిన కేసీఆర్..

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 13సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడి మట్టిని పరమ పవిత్రంగా భావించి ముడుపు కట్టారు. దీనికి కారణం 2001 లో ఆ గ్రామ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరి మిగతా పార్టీలను, తెలంగాణ వ్యతిరేక పత్రికలను గ్రామం నుండి వెలివేశారు. ఆ విషయం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. జిల్లా పర్యటన నిమిత్తం అక్కడికొచ్చిన కేసీఆర్ అక్కడి మట్టిని ముడుపుకట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆ ముడుపును విప్పనని వాగ్ధానం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ రోజు కేసీఆర్ మోతె గ్రామానికి వెళ్లి ముడుపును నెత్తిన పెట్టుకుని సభావేదికపైకి వెళ్లి అర్చకుల మంత్రోచ్చారణల మధ్య ముడుపును విప్పారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో గ్రామస్తులు, కార్యకర్తలు హాజరై బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనమైన స్వాగతం పలికారు. మరోవైపు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ వల్లే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *