mt_logo

ఐదునెలల చిన్నారి ప్రాణాన్ని కాపాడిన కేసీఆర్ కిట్

కేసీఆర్ కిట్ లో స్లీపింగ్ బ్యాగ్ వల్ల ఓ ఐదునెలల పాప ప్రాణం నిలిచింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్‌ జిల్లాకేంద్రానికి చెందిన ఎస్కే జోయబ్‌ భార్యతోపాటు ఐదు నెలల పాప జోయాతో ద్విచక్రవాహనంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మర్రిగూడేనికి బయల్దేరారు. రేపల్లెవాడ సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ గుర్తుతెలియని వాహనం.. వీరి బైక్‌ను ఢీకొట్టడంతో… బైక్‌ ముళ్లపొదళ్లలోకి దూసుకెళ్లగా దంపతులిద్దరికీ తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకొన్నారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ క్రమంలో వారికి చిన్నారి ఏడుపు వినిపించింది. పొదల్లో ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ఉన్న శిశువును చూసి బయటకు తీశారు. శిశువు కేసీఆర్‌ కిట్‌ ‘స్లీపింగ్‌ బ్యాగ్‌’లో ఉండటంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. పాప తల్లిదండ్రులను ఇల్లెందులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జోయబ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం దవాఖానకు రిఫర్‌ చేశారు. కేసీఆర్‌ కిట్‌ నిండు ప్రాణాన్ని కాపాడిందని అక్కడున్న వారు చర్చించుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *