-భూములిచ్చి జీవితాల్లో వెలుగులు నింపారు
-పేద దళితుల మనోగతం
ఏండ్ల తరబడి రైతు కూలీలుగా ఉన్న పేద దళితులకు కేసీఆర్ ప్రభుత్వం తమకు మూడేసి ఎకరాల వ్యవసాయ భూముల పంపిణీతో లబ్ధి దారులు, వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు అవధులు దాటాయి. భారత 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శుక్రవారం భూమిలేని దళితులకు మూడెకరాల భూమి పట్టాలు పంపిణీ చేశారు.
సొంత గ్రామాల్లో భూముల్లేని నిరుపేద దళితులు ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని మాదిరిగా సీఎం కేసీఆర్ భూమి పంపిణీ చేసి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించారు. తమ కాళ్లపై తాము స్వశక్తితో నిలబడేలా చేసినందుకు ఆయనకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు నల్గొండ, ఖమ్మం జిల్లాల పేద దళిత మహిళలు. తమకు భూమి వచ్చిందన్న సంతోషంతో లబ్ధిదారులు తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లారు. వారి ఆనందాన్ని టీ మీడియాతో పంచుకున్నారు. వారేమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం…
కేసీఆర్ నిజంగా దేవుడు
వాగు ద్వారా నా పొలానికి నీళ్లొస్తాయి, రాని రోజుల్లో ప్రత్యామ్నాయంగా బోర్ వేసుకొని సాగు చేస్తా. వివిధ పంటలు సాగు చేసుకుంటా. ఈ మంచి అవకాశం కల్పించిన కేసీఆర్ నిజంగా దేవుడు. ఆయనకు చేతులెత్తి జీవితాంతం దండాలు పెడుతా.. గ్రామాల్లో ఇతరుల నుంచి భూములు ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు ఆ భూములు పంచడం నిజంగా నమ్మలేకపోతున్నాను. త్వరగా నా ఊరుకి వెళ్లి నా పనులు చేసుకుంటానని అన్నది.
దుబ్బాకుల కమలమ్మ, గంధసిరి, ఖమ్మం
ఎంతో ఆనందంగా ఉంది…
నా పేరిట ప్రభుత్వం మూడెకరాల భూమి పట్టా ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా కేసీఆర్ నాకు భూమి మంజూరు చేయడం ఎంతో ఆనందానిస్తున్నది. భూములు లేని పేద రైతులు సొంతంగా వ్యవసాయం చేసుకునేందుకు పని కల్పించారు. సాగు ద్వారా ప్రజలకు ఆహారం అందిస్తాను.
– పద్మ, గొల్లనపాడు గ్రామం, ఖమ్మం జిల్లా
సాగుకు భూమి ఇచ్చినందుకు ధన్యవాదాలు
సొంత భూముల్లో నాకు సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. రాష్ట్రంలో అనేకమంది నాయకులు వచ్చారు. కానీ.. ఈ మంచి పని ఎవరూ చేయలేకపోయారు. ఈ భూములు పంచడం వల్ల పేద దళితులు ఎంతో ప్రయోజనం పొందుతారు. పట్టా భూమి నా పేర రాసివ్వడం నా ఆనందాలకు అవధుల్లేవు.
– ఎ.మాధవి, గ్రామం. అజ్జిలపూరం, కనగల్ మండలం, నల్గొండ జిల్లా..
కేసీఆర్‌కు దండం పెడుతున్నా
వెనకబడిన మా ప్రాంతంలో కేసీఆర్ సర్కార్ మూడెకరాల భూములు పంచడం నాతోపాటు ఇతర లబ్దిదారులు బాగుపడుతారు. ఈ మంచి పని చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మూడెకరాల భూములతో వ్యవసాయం అభివృద్ది చేస్తాం. నేను రైతు కూలిగా పనిచేసే అవకాశం ఉండదు. రైతుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపాడు.
– అరుణ: అజ్జల పూరం నల్గొండ
మూడెకరాల్లో సాగు చేసుకుంటా
నేను కొన్నేండ్లుగా రైతు కూలీగా పని చేస్తున్నా, అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సొంత భూమిగా నా పేర పట్టాభూమి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇకనుంచి ఈ భూమి సాగు చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటా. సొంత భూమి లేని నా లాంటి వారికి ప్రభుత్వం మూడేసి ఎకరాల భూమి ఇవ్వడం సంతోషంగా ఉంది.
– తిరుమల్లి, గొల్లనపాడు, ఖమ్మం
జీవితాంతం రుణపడి ఉంటా
నాకు సీఎం కేసీఆర్ వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఇవ్వడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. పట్టా భూమి చేతికి అందుకున్న నేను కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఈ భూమితో వరి, పత్తి తదితర పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాను. ఈ భూమి ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరోజిని చేతులెత్తి దండాలు పెట్టింది.
– కంచెర్ల సరోజిని…గ్రామం, గొల్లనపాడు, ఖమ్మం
వ్యవసాయం చేసుకొని సొంత కాళ్లపై నిలబడుతా
వ్యవసాయ కూలీగా పని చేసే నాకు పట్టా భూములు రావడంతో నా జీవితంలో ఇంత ఆనందానికి ఎప్పుడు గురి కాలేదు. ఈ భూముల్లో సాగు చేసుకొని హాయిగా బతుకుతాను. ఈ అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు.. రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఆయన తనవంటి పేద దళితులను గుర్తించి మూడు ఎకరాల భూములు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది, నా పొలంలో పనులు చూసుకుంటా.
– కె.తిరుపతమ్మ, గ్రామం గొల్లనపాడు, మండలం వైరా, జిల్లా ఖమ్మం
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..